ఎందరో మహనీయుల ప్రాణ త్యాగ ఫలితమే దేశ స్వేచ్ఛ స్వాతంత్రం అని, మహనీయుల త్యాగ ఫలాలను ప్రతి ఒక్కరం జ్ఞాపకం చేసుకోవాలని గుడ్లవల్లేరు తాసిల్దార్ మల్లికార్జునరావు అన్నారు. గురువారం హారఘర్ తిరంగా అభియాన్ కార్యక్రమన్ని మండల కేంద్రమైన గుడ్లవల్లేరులో నిర్వహించారు. ఈ సందర్భంగా తాసిల్దార్ మల్లికార్జున రావు మాట్లాడుతూ మహనీయుల సేవలు మరువలేనివి అని ప్రతి ఒక్కరం జ్ఞాపకం చేసుకోవాలని తెలిపారు.