నేటి యువత మహనీయుల జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలని, దేశభక్తిని పెంపొందించుకోవాలని జగ్గయ్యపేట మాజీ శాసనసభ్యులు సామినేని ఉదయభాను అన్నారు. గురువారం 78వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు సందర్భంగా పట్టణంలోని విజయవాడ రోడ్లో ఎస్ పి టి తోటలో నియోజకవర్గ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన జాతీయ జెండాను ఎగుర వేశారు. తొలుత జాతీయ నాయకుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.