కైకలూరు ఎమ్మెల్యే రేపటి పర్యటన వివరాలు ఇవే..

53చూసినవారు
కైకలూరు ఎమ్మెల్యే రేపటి పర్యటన వివరాలు ఇవే..
కైకలూరు ఎమ్మెల్యే డా. కామినేని శ్రీనివాస్ రేపటి పర్యటన వివరాలను ఎమ్మెల్యే కార్యాలయం ఖరారు చేసింది. ఆదివారం ఉదయం 08:30 నిముషాలకు ఆచవరం గ్రామములో నరేగా నిధులతో మంజూరైన సీసీ రోడ్లకు శంఖుస్థాపన చేస్తారు. ఉదయం 9:00 గంటలకులకు వింజరం గ్రామములో నరేగా నిధులతో మంజూరైన సీసీ రోడ్లకు శంఖుస్థాపన చేస్తారు. ఉదయం 9:30 నిముషాలకు వేమవరప్పాడు గ్రామములో నరేగా నిధులతో మంజూరైన సీసీ రోడ్లకు శంఖుస్థాపన కార్యక్రమంలో పాల్గొంటారని, కూటమి నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొనాలని తెలిపారు.

సంబంధిత పోస్ట్