మచిలీపట్నం: ప్రమాదాల జోన్ లో మద్యం షాపులకు అనుమతి వద్దు

53చూసినవారు
మచిలీపట్నం: ప్రమాదాల జోన్ లో మద్యం షాపులకు అనుమతి వద్దు
కృష్ణా జిల్లా చల్లపల్లి మండలం రామానగరం హిందూ స్మశాన వాటిక ఆవరణం ప్రాంతంలో మద్యం షాపు ఏర్పాటుకు అనుమతి వద్దు అంటూ స్థానిక మహిళలు జిల్లా జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మకి మహిళలు వినతిపత్రం అందించారు. గురువారం వారు మచిలీపట్నంలో మాట్లాడుతూ, మద్యం షాపు ఏర్పాటు చేసే ప్రదేశం ఎక్కువగా యాక్సిడెంట్లు జరుగుతాయన్నారు. యాక్సిడెంట్ జోన్ లో షాపు ఏర్పాటుతో ఆ ప్రాంతం మరింత ప్రమాదకరంగా మారుతుందని తెలిపారు.

సంబంధిత పోస్ట్