ఎన్టీఆర్ జిల్లా కలెక్టరుగా బాధ్యతలు చేపట్టిన డాక్టర్ జి. లక్ష్మీ షా ని మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణ ప్రసాదు మంగళవారం విజయవాడలోని కలెక్టర్ కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు పుష్పగుచ్చాన్ని అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. శాసనసభ్యులు కృష్ణప్రసాదు మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నాయకత్వంలో జిల్లాను ప్రగతిపథంలో నిలిపే క్రమంలో తమవంతు కృషి చేస్తామన్నారు.