మహాత్మ జ్యోతిరావు పూలే గొప్ప మానవతావాదని పామర్రు మాజీ ఎమ్మెల్యే డివై దాస్ పేర్కొన్నారు. మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు గురువారం పామర్రులోని డివై దాస్ కార్యాలయంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా పూలే చిత్రపటానికి పూలమాలవేసి ఆయన నివాళులర్పించారు. అనంతరం దాస్ మాట్లాడుతూ జాతిని మేల్కొల్పిన సంఘసంస్కర్తగా పూలే దేశంలో కీర్తించబడుతున్నారన్నారు.