పామర్రు నియోజకవర్గంలో ఏకగ్రీవంగా ఎన్నికైన నీటి సంఘాల కమిటీ అధ్యక్షులను ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా మంగళవారం అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. గత ప్రభుత్వంలో రైతుకు కావాల్సిన సాగు కాలువలను అభివృద్ధి చేయలేదన్నారు. సీఎం చంద్రబాబు నీటి సంఘాల ఎన్నికలు నిర్వహించి, రైతు సంఘానికి ఊపిరి పోసి, రైతు పక్షంలో ఉండే ప్రభుత్వం ఇది అని చంద్రబాబు మరోసారి నిరూపించుకున్నారన్నారు. పలువురు నాయకులు పాల్గొన్నారు.