కలియుగ దైవం శ్రీవెంకటేశ్వర స్వామి ఆలయంలో అతి పవిత్రమైన లడ్డూ ప్రసాదాన్ని అపవిత్రం చేసిన వారిపై కఠినచర్యలు తీసుకోవాలని పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ డిమాండ్ చేశారు. తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి వారి లడ్డూలో కల్తీ నెయ్య కలిపి అపవిత్రం చేసినందుకు గాను ప్రాయశ్చిత్తంగా బంటుమిల్లి లోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో సోమవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇటువంటి సంఘటనలు జరగటం దారుణం అన్నారు