పెడన పట్టణంలోని పైడమ్మ తల్లి మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. సోమవారం రాత్రి అమ్మవారి తెప్పోత్సవ కార్యక్రమాన్ని హంస వాహనంపై నిర్వహించారు. స్వామి అమ్మవార్లను ప్రత్యేకంగా అలంకరించగా, నియోజకవర్గ శాసనసభ్యులు కాగిత కృష్ణ ప్రసాద్ పాల్గొని ప్రత్యేక పూజ కార్యక్రమం నిర్వహించారు.