అల్పపీడన ప్రభావంతో సోమవారం కురిసిన భారీ వర్షానికి అంతర్గత రహదారులు జలమయంగా మారాయి. పెడన నియోజకవర్గంలోని పలు మండలాలతో పాటు గ్రామాల్లో అంతర్గత రహదారులు, లోతట్టు ప్రాంతాలు నీటిమయంగా మారాయి. కనీసం బయటికి నడిచి వెళ్లేందుకు కూడా వీలు లేకపోవడంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. రహదారుల అభివృద్ధికి ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్ చూపాలని కోరుతున్నారు.