పెడన పట్టణంలోని 13వ వార్డు మఠం వీధిలో పాలిటెక్నిక్ చదువుతున్న బట్ట జ్ఞాన పూజకు ప్రమాదవశాత్తు ఆటో ఢీ కొని కాలు పూర్తిగా చిద్రం అయిపోయింది. వెంటనే సమీపంలో ఉన్న ఆసుపత్రికి తీసుకువెళ్లగా ఆమె కాలుకి రెండు మేజర్ ఆపరేషన్లు చేయాలని వైద్యులు సూచించారు. ఈ నేపథ్యంలో దేవాంగ యూత్ సేవా సమితి సభ్యులు స్పందించి శుక్రవారం మొత్తం రూ. 2. 30 లక్షలను సేకరించి ఆ సదరు మొత్తాన్ని ఆ విద్యార్థినికి అందజేశారు.