20 కోట్లతో నూజివీడు నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు రాష్ట్ర గృహనిర్మాణ, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రివర్యులు కొలుసు పార్థసారధి తెలిపారు. గురువారం తాడికడుపులోని ఆయన క్యాంపు కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ నియోజకవర్గములో ఒక పెద్ద పాలేరులా పనిచేస్తానని తెలిపారు. నూజివీడు నియోజకవర్గ అభివృద్ధి తన ప్రధాన కర్తవ్యం అని అభివృద్ధి విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని ఆయన తెలిపారు.