పెనమలూరు: కరెంటు సర్దుబాటు చార్జీలను నిలిపివేయాలి

79చూసినవారు
కరెంటు సర్దుబాటు చార్జీలను నిలిపి వేయాలని కోరుతూ గురువారం సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. తాడిగడప మున్సిపాలిటీ పరిధిలోని పోరంకి కార్మిక నగర్ 2లో కరెంట్ బిల్లులు దగ్ధం చేసి నిరసన కార్యక్రమం చేపట్టారు. సిపిఎం పార్టీ నాయకులు ఉప్పాడ త్రిమూర్తులు మాట్లాడుతూ సర్దుబాటు చార్జీల పేరుతో 15. 484 కోట్లు భారాన్ని ప్రజల మీద వేయడానికి స్పాట్ మీటర్లు పెడుతున్నారని ఆరోపించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్