విస్సన్నపేట లో కొండముచ్చులు హల్ చల్

69చూసినవారు
తిరువూరు నియోజకవర్గ పరిధిలో గల విసన్నపేట పట్టణంలో కొండముచ్చులు ప్రజలను భయపెడుతున్నాయి. వీటితోపాటు కోతులు, కుక్కలు, పందులు తమ సంతాన ఉత్పత్తిలో రోజు రోజుకి పోటీ పడుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. దీంతో మండల కేంద్రంలోని ప్రజలు వీటి బారిన పడి ఇబ్బందులు పడుతున్నామని చెప్తున్నారు. సంబంధిత శాఖ అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని విస్సన్నపేట వాసులు శుక్రవారం కోరుచున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్