నేడు విజయవాడలో ఉచిత మెకానిక్ శిబిరాలు

74చూసినవారు
నేడు విజయవాడలో ఉచిత మెకానిక్ శిబిరాలు
విజయవాడ వరదల్లో నీట మునిగిన ద్విచక్ర వాహనాలను ఆదివారం ఉచితంగా రిపేరు చేయనున్నట్లుగా నవ్యాంధ్ర టూ వీలర్స్ మెకానిక్ వెల్ఫేర్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు షేక్. సుభాని వెల్లడించారు. సింగ్ నగర్, చర్చి సెంటర్, భవానిపురం, హౌసింగ్ బోర్డు, సితార తదితర సెంటర్లలో రెండు చొప్పున మొత్తం పది ఉచిత శిబిరాలను ఏర్పాటు చేసినట్లుగా ఆయన వివరించారు. ఉదయం 7 నుంచి రాత్రి 7 గంటల వరకు అందుబాటులో ఉంటామని తెలిపారు.

సంబంధిత పోస్ట్