ఎన్టీఆర్ జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించుటకు గాను 5వ తేది మంగళవారం విజయవాడలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి విక్టర్ బాబు, జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి శ్రీనివాసరావు ఆదివారం సంయుక్తంగా తెలిపారు. ఈ జాబ్ మేళాలో ముక్కు ఫైనాన్షియల్ కన్సల్టింగ్ ప్రైవేట్ లిమిటెడ్ వంటి ప్రముఖ కంపెనీల వారు పాల్గొంటారని తెలిపారు.