కొండపల్లి మున్సిపాలిటీ పరిధిలోని పలు సమస్యలపై మైలవరం ఎమ్మెల్యే వెంకట కృష్ణప్రసాదు తన స్వరాన్ని వినిపించారు. ఏపీ అసెంబ్లీలో జీరో అవర్ లో ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మున్సిపల్ మరియు పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ కి అసెంబ్లీలో కొండపల్లి మున్సిపాలిటీలోని పలు సమస్యలను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. మున్సిపాలిటీ గా ఏర్పడి సంవత్సరాలు గడుస్తున్న ఇప్పటివరకు గత్యంతరం లేదని పేర్కొన్నారు.