విజయవాడ: విద్యార్థి మృతిపై మంత్రి సవిత దిగ్భ్రాంతి
దుద్దుకూరు బీసీ బాలుర వసతి గృహం ఎనిమిదో తరగతి విద్యార్థి వరుణ్ తేజ్ దుర్మరణపాలయ్యాడు. శుక్రవారం విద్యార్థి మృతిపై మంత్రి సవిత విచారంవ్యక్తంచేశారు. మీడియా సమావేశంలో ఆమెమాట్లాడుతూ పాఠశాల విడిచి పెట్టిన తరవాత మరో ముగ్గురు విద్యార్థులతో కలిసి పక్కనున్న చెరువులో స్నానానికి వెళ్లాడన్నారు. వరుణ్ తేజ్ ఒక్కడే స్నానానికి చెరువులో దిగాడని, ఈతకు రాకపోవడంతో నీటి మునిగి మృతిచెందాడని మంత్రి ఆవేదన వ్యక్తంచేశారు.