వైసీపీ సోషల్ మీడియా పీటీఎం సైకోలపై చర్యలు తీసుకోవాలంటూ అవనిగడ్డ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ పరిశీలకుడు కనపర్తి శ్రీనివాస్ డిమాండ్ చేశారు. సోమవారం అవనిగడ్డ పోలీస్ స్టేషన్ వద్ద కూటమి నేతలు నిరసన ప్రదర్శన చేపట్టారు. కూటమి నేతల కుటుంబ సభ్యులను అసభ్య పదజాలంతో దుష్చిస్తూ వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలు చేస్తున్న అరాచకాలను ప్రజాస్వామ్య వాదులంతా ఖండించాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు.