అవనిగడ్డ: ప్రజలకు ఇబ్బంది కలిగే చోట దుకాణాలు పెట్టవద్దు

71చూసినవారు
అవనిగడ్డ: ప్రజలకు ఇబ్బంది కలిగే చోట దుకాణాలు పెట్టవద్దు
ప్రజలకు అసౌకర్యం కలిగే ప్రాంతాల్లో మద్యం దుకాణాలు ఏర్పాటు చేయకుండా చూడాలని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ ఎక్సైజ్ శాఖ అధికారులను ఆదేశించారు. శుక్రవారం అవనిగడ్డలో ఆయన మీడియాతో మాట్లాడుతూ నియోజకవర్గంలోని గ్రామాల్లో నూతనంగా ఏర్పాటు చేస్తున్న మద్యం దుకాణాలు ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, దేవాలయాలు, ప్రార్థన మందిరాలకు దూరంగా, ప్రజల నివాస ప్రాంతాలకు దూరంగా ఏర్పాటు చేసేలా శ్రద్ధ వహించాలని సూచించారు.

సంబంధిత పోస్ట్