అవనిగడ్డ: జాతీయ లోక్ ఆదాలత్ ను సద్వినియోగం చేసుకోవాలి

76చూసినవారు
అవనిగడ్డ: జాతీయ లోక్ ఆదాలత్ ను సద్వినియోగం చేసుకోవాలి
డిసెంబర్ 14వ తేదీన జరిగే జాతీయ లోక్ అదాలత్ ను సద్వినియోగం చేసుకోవాలని సీనియర్ సివిల్ జడ్జి బాబు నాయక్ కోరారు. శుక్రవారం అవనిగడ్డలో ఆయన మీడియాతో మాట్లాడుతూ రాజీ పడదగ్గ కేసులను కక్షిదారులు పరిష్కరించుకోవాలని సూచించారు. చిన్నపాటి సమస్యలను పెద్దగా ఆలోచించకుండా వాటిని లోక్ అదాలత్ ద్వారా పరిష్కరించుకుని మేలు పొందాలని కోరారు. ప్రతి సమస్యకు పరిష్కారం మన దగ్గరే ఉంటుందని, ఆలోచించి పరిష్కరించుకోవాలన్నారు.

సంబంధిత పోస్ట్