ఘంటసాల పిహెచ్సిని వైద్యఆరోగ్యశాఖ జాయింట్ డైరెక్టర్ రత్నావళి, ప్రొగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ సుదర్శన్, కన్సల్టెంట్ ప్రహర్షలు బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. కమిషనర్ ఆఫ్ హెల్త్ వారి ఆదేశాల మేరకు వారు ఈ పిహెచ్సిని తనిఖీ చేసినట్లు వారు తెలిపారు. పిహెచ్సిలో 100 అంశాలను పరిశీలించి సంతృప్తిని వ్యక్తం చేసినట్లు చెప్పారు. వైద్యసేవలతోపాటు పిహెచ్సిలో సౌకర్యాలు తదితర విషయాలను పరిశీలించారు.