అవనిగడ్డ నియోజకవర్గ పరిధిలోని మంగళాపురం నుంచి మాజేరు వరకు గల పిల్లంకోడు డ్రైన్ పరిధిలోని రైతుల పొలాలు ముంపునకు గురయ్యాయి. ఇటీవల వచ్చిన భారీ వరదలు, వర్షాల కారణంగా చల్లపల్లి మండలంలోని మంగళాపురం రెవిన్యూ నుంచి మాజేరు గుండేరు డ్రైన్ వరకూ గల పిల్లంకోడు డ్రైనేజీ పరిధిలో సుమారు 1, 200 ఎకరాలలోని పచ్చని పొలాలు పూర్తిగా నీట మునిగాయని ఆ ప్రాంతాల రైతులు ఆదివారం ఆవేదన వ్యక్తం చేశారు.