ప్రజల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా "జనవాణి - జనసేన భరోసా'' కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ తెలిపారు. బుధవారం ఏపీ డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో "జనవాణి - జనసేన భరోసా" కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రం నలుమూలల నుంచి తమ సమస్యలపై ఇచ్చిన అర్జీలు ఎమ్మెల్యే స్వీకరించారు.