కృష్ణాజిల్లా మోపిదేవి గ్రామంలో ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న శ్రీ వల్లీ దేవసేనా సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని జస్టిస్ రవీంద్రబాబు కుటుంబ సమేతంగా శనివారం దర్శించుకున్నారు. ఆలయ పండితులు, అర్చక స్వాములు ఘన స్వాగతం పలికారు. ఆలయ ఆవరణలో గల నాగపుట్టలో పాలు పోసి, మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం శ్రీ స్వామి వారిని దర్శించుకోగా, ఆలయ అర్చకులు వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.