మచిలీపట్నం: పది పరీక్షలకు అన్ని ఏర్పాట్లు

52చూసినవారు
మచిలీపట్నం: పది పరీక్షలకు అన్ని ఏర్పాట్లు
కృష్ణా జిల్లాలో ఈనెల 17వ తేదీ నుంచి నిర్వహించనున్న 10వ తరగతి పరీక్షల నిర్వహణకు అన్నీ ఏర్పాట్లు చేసినట్టు జిల్లా విద్యాశాఖ అధికారి పివిజే. రామారావు తెలిపారు. గురువారం మచిలీపట్నం కలెక్టరేట్లోని విద్యాశాఖ కార్యాలయం నందు పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని పలు జడ్పీ హైస్కూల్లో ఈ పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. తాగునీరు, ఇతర సౌకర్యాలు కల్పించామన్నారు.

సంబంధిత పోస్ట్