భావన్నారాయణ స్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే

82చూసినవారు
అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ శుక్రవారం ఉదయం నాగాయలంక మండల పరిధిలోని భావదేవరపల్లి గ్రామంలో ఉన్న ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం శ్రీ భావన్నారాయణ స్వామి వారి దేవస్థానాన్ని దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ ప్రధాన అర్చకులు, వేద పండితులు పూర్ణ కుంభంతో అపూర్వ స్వాగతం పలికారు. గ్రామ సర్పంచ్ మండలి ఉదయభాస్కర్ ఆధ్వర్యంలో గ్రామ పెద్దలు ఆయనకు ఆత్మీయ స్వాగతం పలికి ఘనంగా సత్కరించారు.

సంబంధిత పోస్ట్