ఘంటసాల మండలం శ్రీకాకుళం ఎస్సీ హాస్టల్ ను మంగళవారం సాయంత్రం ఎంపీడీవో బి. మారుతి శేషమాంబ సందర్శించారు. విద్యార్ధులతో మాట్లాడి మంచిగా చదివి మంచి మార్కులు సాధించాలన్నారు. డ్రైనేజీ పనులు జరిగేలా చర్యలు చేపడతామని తెలియచేశారు. ఈ సందర్శనలో తెలుగురావుపాలెం సర్పంచ్ రాచూరి ప్రసాద్ బాబు, మండల పరిషత్ ఏఓ శ్రీనివాస చందు, వార్డెన్ జ్ఞాన సుందరి తదితరులు ఉన్నారు.