నాగాయలంక: ముంపు బారిన పడిన 900 ఎకరాలలో వరి పైరు

81చూసినవారు
నాగాయలంక: ముంపు బారిన పడిన 900 ఎకరాలలో వరి పైరు
బంగాళా ఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంగా గత నాలుగు రోజుల నుంచి నాగాయలంక మండలంలో విస్తారంగా భారీ వర్షాలు కురిశాయి. గురువారం ఒక్కరోజే 82. 9 మీ. మీ వర్ష పాతంగా నమోదయింది. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు డ్రయినేజీ వ్యవస్థ సక్రమంగా పని చేయక పోవటంతో కాలువ చివర ప్రాంతాలలో ఉన్న వరి పొలాలు ముంపు బారిన పడ్డాయి. పలు గ్రామాలలో 900 ఎకరాలలో వరిపంట ముంపు బారినపడినట్లు వ్యవసాయాధికారులు తెలిపారు.

సంబంధిత పోస్ట్