ఘంటసాల మండలం శ్రీకాకుళం నుంచి వయా పాపవినాశనం, గోగినేనిపాలెం, చినకళ్లేపల్లి, వేముపల్లి మీదుగా చల్లపల్లి వెళ్లటానికి ఆర్టీసీ బస్సు సర్వీసు తిరిగి ప్రారంభించాలని ఘంటసాల మండలం గోగినేనిపాలెం టీడీపీ నాయకులు కుంపటి సుబ్బారావు కోరారు. ఈ మేరకు శనివారం అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్దప్రసాద్, ఆర్టీసీ డిపో మేనేజర్ హనుమంతరావుకు వినతిపత్రాన్ని అందజేశారు. ప్రజలు పడుతున్న ఇబ్బందులు వారికి వివరించారు.