రైతులకు సమర్థవంతంగా సాగునీరు అందించడమే లక్ష్యంగా పని చేస్తున్నట్లు అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ తెలిపారు. శుక్రవారం ఘంటసాల మండలం దాలిపర్రు వద్ద గుండేరు లిఫ్ట్ ఇరిగేషన్ పథకాన్ని ఆయన పరిశీలించారు. ఇరిగేషన్ శాఖ మచిలీపట్నం, అవనిగడ్డ సబ్ డివిజన్ అధికారులతో కలిసి సాగునీటి పరిస్థితిని పరిశీలించారు. ప్రతి చేనుకు సాగునీరు అందేలా అధికారులు కృషి చేయాలని సూచించారు.