కోడూరు మండలం హంసలదీవి బీచ్ వద్దకు విహారయాత్రకు వచ్చి సముద్ర తీరంలో గల్లంతైన అబ్దుల్ ముషారఫ్ కోసం కోడూరు మండల తహసిల్దార్ ఆధ్వర్యంలో మంగళవారం ప్రత్యేక గాలింపు చర్యలు చేపట్టారు. తహసిల్దార్ శ్రీను నాయక్ తమ యొక్క రెవెన్యూ సిబ్బంది, పోలీస్, మెరైన్ సిబ్బందితో కలిపి ప్రత్యేక బోట్ లో మాలకాయలంక ప్రాంతంలో ముషారఫ్ కోసం గాలించారు. నిజాంపట్నం, గిలకలదిండి, మెరైన్ పోలీసులకు కూడా సమాచారం అందించారు.