ఉప్పు నీరు చేరి ఇబ్బందులు పడుతున్నాం: రైతులు

75చూసినవారు
కోడూరు మండలం 15 నెంబర్ 16 నెంబర్ కాలువ కింద రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తపరుస్తున్నారు. శనివారం వారు మీడియాతో మాట్లాడుతూ, అవుట్ ఫాల్స్ పని చేయకపోవడం వల్ల సముద్రపు ఉప్పునీరు ఎదురు రావటంతో మా పంట భూమి కాస్త చౌడు భూమిగా మారిపోతున్నాయని, అధికారులకు మొరపెట్టుకుంటున్నా మా మొర ఆలకించే నాధుడే లేడన్నారు. ఎలాగోలో కాస్త వరుణ దేవుడు కరుణ వల్ల నారుముళ్ళు పోసినా ఉప్పునీరు చేరి నారుమళ్లు చచ్చిపోయాయన్నారు.

సంబంధిత పోస్ట్