టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంతకు గాయం
స్టార్ హీరోయిన్ సమంత గాయపడింది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. యాక్షన్ సీన్ లో గాయపడినట్టు ఆమె తెలిపింది. మోకాలికి అయిన గాయానికి సూదులతో (ఆక్యుపంక్చర్) చికిత్స తీసుకుంటున్న ఫొటోను షేర్ చేసింది. గాయాలపాలు కాకుండా యాక్షన్ స్టార్ ను కాగలనా? అని ఆమె రాసుకొచ్చింది. ఆమె గాయానికి సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ గా అయ్యాయి. దీంతో అభిమానులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.