నియోజకవర్గ అభివృద్ధికి కూటమి నేతలు సహకరించాలని గన్నవరం శాసనసభ్యులు యార్లగడ్డ వెంకట్రావు హితువు పలికారు. మంగళవారం గన్నవరంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ తాను ఒక్కడినే కష్టపడితే సరిపోదని అందరూ సమిష్టిగా కష్టపడితే అభివృద్ధి సాధ్యమని పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం సూపర్ సిక్స్ ప్రకటిస్తే తాను గన్నవరం నియోజకవర్గానికి కూడా సూపర్ సిక్స్ ప్రకటించారని గుర్తు చేశారు.