గన్నవరం: జాతీయ పవర్ లిఫ్టింగ్ పోటీలకు ఎంపికైన హర్షిత

82చూసినవారు
గన్నవరం: జాతీయ పవర్ లిఫ్టింగ్ పోటీలకు ఎంపికైన హర్షిత
గన్నవరం నియోజకవర్గం దావజీగూడెంలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థిని మద్దూరి హర్షిత జాతీయ పవర్ లిఫ్టింగ్ పోటీలకు ఎంపికైనట్లు ప్రధానోపాధ్యాయులు సునీత సోమవారం తెలిపారు. విజయవాడ కృష్ణలంకలో జరిగిన 68వ రాష్ట్ర స్థాయి పవర్ లిఫ్టింగ్ పోటీలలో రజత పతకం సాధించి జాతీయస్థాయి పోటీలకు ఎంపికైందని అన్నారు. ఈ సందర్భంగా హర్షితకు శిక్షణ ఇచ్చిన వ్యాయామ ఉపాధ్యాయులు చెక్కిరాల చందు, విజయ కుమారిలను అభినందించారు.

సంబంధిత పోస్ట్