గన్నవరం నుంచి అగిరిపల్లి రోడ్డులో ఉన్న డంపింగ్ చెత్త సమస్య తీరనట్లేనా అని పలువురు ప్రశ్నిస్తున్నారు. శుక్రవారం డంపింగ్ చేసిన చెత్తకి గుర్తు తెలియని వ్యక్తులు పెట్రోల్ పోసి నిప్పంటించారు. దీనితో గన్నవరం నుంచి అగిరిపల్లి రోడ్డులో ప్రయాణించేటటువంటి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు సమస్యపై సత్వరమే దృష్టిపెట్టాలని పలువురు కోరుతున్నారు.