మాల మహానాడు గన్నవరం నియోజకవర్గ అధ్యక్షుడు ఆంథోని ఆధ్వర్యంలో, ఆదివారం మాల మహానాడు వ్యవస్థాపకులు పీవీ రావు 19వ వర్ధంతిని మాల మహానాడు నాయకులు నిర్వహించారు. ముందుగా ఆయన చిత్రపటానికి పూల మాలాలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం నియోజకవర్గ అధ్యక్షుడు సరిహద్దు ఆంథోని మాట్లాడుతూ.. అంబేద్కర్ ఆశయాల కోసం తన జాతి కోసం రథసారధి పివి రావు తన ఐఏఎస్ ఉద్యోగాన్నే వదిలి వేశారన్నారు.
Where: గన్నవరం