గన్నవరం నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడపడమే లక్ష్యంగా పనిచేస్తున్నానని ప్రభుత్వ విప్, గన్నవరం శాసనసభ్యులు యార్లగడ్డ వెంకట్రావ్ పేర్కొన్నారు. నియోజకవర్గంలోని ఆత్కూరు గ్రామంలో రూ. 76 లక్షల మేర నిధులతో రెండు సీసీ రోడ్ల నిర్మాణానికి మంగళవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా యార్లగడ్డ వెంకట్రావ్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో రోడ్ల నిర్మాణానికి మహర్దశ వచ్చిందని అన్నారు.