Jan 22, 2025, 07:01 IST/
దారుణం.. నడిరోడ్డుపైనే ఆటోడ్రైవర్ హత్య
Jan 22, 2025, 07:01 IST
హనుమకొండ జిల్లా కేంద్రంలో దారుణం జరిగింది. పట్టణంలోని రోహిణి ఆసుపత్రి సమీపంలో పట్టపగలే ఆటో డ్రైవర్‌ను ఇంకొ ఆటో డ్రైవర్ హత్య చేశాడు. ఈ హత్యతో స్థానికులు ఉలిక్కి పడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మృతుడు మడికొండకు చెందిన మాచర్ల రాజ్ కుమార్‌గా గుర్తించారు. హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.