పేదలకు కడుపునిండా తిండి పెట్టడం జీవితంలో సంతృప్తినిస్తుందని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరితో కలిసి గురువారం గుడివాడలో తుమ్మల సీతారామపురం మున్సిపల్ పార్క్ లో అన్న క్యాంటీన్ పునః ప్రారంభించి, పేదలకు ఆహార పదార్థాలు వడ్డించారు.
వివిధ వర్గాలకు చెందిన లబ్ధిదారులతో కలసి ముఖ్యమంత్రి దంపతులు భోజనం చేశారు.