క్రిస్మస్ పర్వదినం సందర్భంగా గుడివాడ నియోజకవర్గ ప్రజలకు ఎమ్మెల్యే వెనిగండ్ల రాము క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. మంగళవారం ఈ మేరకు పత్రిక ప్రకటన విడుదల చేశారు. ప్రేమాభావం, సేవాతత్పరతను క్షమాగుణాన్ని బోధించిన క్రీస్తు జన్మదినమై క్రిస్మస్ పండుగను క్రైస్తవులు సంతోషంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఏసుప్రభువు చూపిన మార్గం శాంతి, సహనం, ప్రేమ మార్గాలలో ప్రతి ఒక్కరూ నడవాలని అన్నారు.