మత్స్యకారుల జీవన అభివృద్ధికి అధ్యయనం: యూనిసెఫ్ డిస్టిక్ కో ఆర్డినేటర్

675చూసినవారు
మత్స్యకారుల జీవన అభివృద్ధికి అధ్యయనం: యూనిసెఫ్ డిస్టిక్ కో ఆర్డినేటర్
ఆప్ లాండ్ మండలాల్లో ఉన్న మత్స్యకారుల జీవనాభివృద్ధికి అధ్యయనం చేస్తున్నట్లు యూనిసెఫ్ జిల్లా కోఆర్డినేటర్ రాధిక అన్నారు. శుక్రవారం ఆమె జగ్గయ్యపేటలోని స్వచ్ఛంద సంస్థ కర్లపాటి చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు, సామాజికవేత్త కర్లపాటి వెంకట శ్రీనివాస రావు తో కలిసి పట్టణ, మండల పరిధిలోని పలు గ్రామాలను సందర్శించారు. స్థానికంగా ఉన్న మత్స్యకారులతో చర్చి పలు విషయాలను సేకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించటం ద్వారా కలిగే పలు ప్రయోజనాలను విశదీకరించారు. పట్టణ పరిధిలోని డాంగేనగర్‌లో గల మత్స్యకారులతో సంప్రదించి వారి సమస్యలను చైర్మన్ రాఘవేంద్ర దృష్టికి తీసుకువచ్చారు.

సామాజికవేత్త కర్లపాటి వెంకట శ్రీనివాసరావు మాట్లాడుతూ ఎమ్మెల్యే ఉదయభాను సహకారంతో సంక్షేమ పథకాల అమలుకు కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం వహించిన వి ఎఫ్ ఏ దివి బాల గోపీనాథ్ ప్రస్తుతం ప్రభుత్వం అందిస్తున్న పలు కార్యక్రమాలను విశదీకరించారు. కాగా ఈ కార్యక్రమంలో వాలంటర్ నాగలక్ష్మి, ట్రస్ట్ సిబ్బంది, ఆర్.వెంకటేశ్వరరావు, మత్స్యకారుల సంఘ ప్రతినిధులు వెంకటేశ్వరరావు నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్