జిల్లాలో ప్రభుత్వ నిషేధిత గుట్కా ఉత్పత్తులను తరలించిన, విక్రయించిన, నిల్వలు కలిగి ఉన్న చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు పోలీసు యంత్రాంగం. జిల్లా ఎస్పీ సిద్దార్థ్ కౌశల్ ఆదేశాల మేరకు.. నందిగామ డిఎస్పి నాగేశ్వర రెడ్డి పర్యవేక్షణలో, జగ్గయ్యపేట సీఐ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో, చిల్లకల్లు ఎస్సై చిన్నబాబు జగ్గయ్యపేట మండలం, చిల్లకల్లు పోలీస్ స్టేషన్ పరిధిలోని షేర్ మహమ్మద్ పేట గ్రామంలో, సిబ్బందితో కలిసి రైడ్ నిర్వహించారు. సుమారు రూ. 3000/- విలువ గల అక్రమ గుట్కా ప్యాకెట్లు కలిగి ఉన్న తెలంగాణ రాష్ట్రం, మల్లారం గ్రామానికి చెందిన కుంచపర్తి నరసింహారావు అను అతనిని అదుపులోకి తీసున్నారు. కేసు నమోదు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చిల్లకల్లు ఎస్సై తెలియజేసారు.