జగ్గయ్యపేటలో మంగళవారం రాత్రి ఉద్రిక్తత నెలకొంది. పట్టణంలోని క్రిస్టియన్ పేటలో రెండు వర్గాల ప్రజలు దారుణంగా కొట్టుకున్నారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఇరు వర్గాలను చెదరగొట్టారు. అడ్డుకోవడానికి వెళ్లిన కానిస్టేబుల్‌పై దాడి చేశారు. ఈ దాడిలో 17 మంది గాయపడ్డారు. పాత కక్షల నేపథ్యంలోనే గొడవ జరిగినట్లు సమాచారం. మరింత సమచారం తెలియాల్సి ఉంది.