వైసీపీకి వరుస షాకులు తగులుతున్నాయి. మాజీ మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ బుధవారం వైసీపీకి రాజీనామా చేశారు. ఎమ్మెల్యేగా పోటీ చేసే ఛాన్స్ లేకపోవడంతో పార్టీకి రాజీనామా చేసినట్లు ప్రకటించారు. ఈ మేరకు పార్టీ ప్రాథమిక సభ్యత్వాన్ని రాజీనామా చేశారు. రాజీనామా లేఖను వైసీపీ అధినేత జగన్కు పంపించారు. అయితే ఇటీవల తన్నీరు నాగేశ్వరరావును జగ్గయ్యపేట ఇంఛార్జ్ గా నియమించింది వైసీసీ. ఇక జగ్గయ్యపేట ఎమ్మెల్యే సీటు ఇచ్చే అవకాశం లేకపోవడంతో వాసిరెడ్డి పద్మ రాజీనామా చేసినట్లు చర్చ కొనసాగుతుంది.