తెలుగు ప్రజలు గర్వించదగిన స్వాతంత్ర సమరయోధుడు వడ్డే ఓబన్న అని జగ్గయ్యపేట ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ తాతయ్య పేర్కొన్నారు. శనివారం పెనుగంచిప్రోలులోని వడ్డెరపల్లిలో ఓబన్న జయంతి కార్యక్రమంలో కూటమి నాయకులతో కలిసి శాసనసభ్యులు పాల్గొని ఓబన్న చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెల్ల దొరల అక్రమ పన్ను వసూళ్ల పై తిరుగుబాటు చేసిన ధీరోదాత్తుడని ఆయన తెలిపారు.