ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో సంక్రాంతి పండుగ కల్లా గుంతల రోడ్లన్నీ బాగు చేయాలని ఆదేశాలిచ్చినా అధికారులు అలసత్వంతో పెనుగంచిప్రోలు నుండి ముళ్లపాడు హైవే వరకు గుంటలు పూడ్చే కార్యక్రమానికి నిధులు కేటాయించలేదు. విషయం తెలుసుకున్న మండల టిడిపి అధ్యక్షులు చింతల వెంకట సీతారామయ్య తన సొంత నిధులతో గురువారం పెనుగంచిప్రోలు నుండి ముండ్లపాడు హైవే వరకు గుంటలు పుడ్చే కార్యక్రమాన్ని మొదలు పెట్టినారు.