జగ్గయ్యపేట సర్కిల్ పరిధిలోని కోడి పందాల బరులను ఆదివారం స్పెషల్ టీం ధ్వంసం చేసింది. విజయవాడ సిటీ పోలీస్ కమిషనర్ ఎస్. వి. రాజశేఖర్ బాబు ఆదేశాల మేరకు, నందిగామ సబ్ డివిజన్ డిఎస్పీ తిలక్ ఒక స్పెషల్ టీమ్ ను ఏర్పాటు చేసి జగ్గయ్యపేట ఎస్ఐ రాజుని ప్రత్యేక అధికారిగా నియమించారు. ఆదివారం జగ్గయ్యపేట, చిల్లకల్లు, వత్సవాయి, పెనుగంచిప్రోలు పరిధిలో కోడి పందాలు నిర్వహించే బరులును ధ్వంసం చేశారు.