కైకలూరు శ్రీ శ్యామలాంబ అమ్మవారి కళా మండపంలో సంక్రాంతి సంబరాలలో భాగంగా ఎంపీటీసీ మంగినేని రామకృష్ణ ఆర్ధిక సహకారంతో నిర్వహించిన ముగ్గుల పోటీలలో గెలుపొందిన విజేతలకు మంగళవారం ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ బహుమతులు అందించారు. ఈ ముగ్గుల పోటీలో పాల్గొన్న వారికి అభినందనలు తెలిపారు. అనంతరం మాజీ ఎంపీటీసీ పైడిమర్రి రాధాకృష్ణ ఆర్ధిక సహకారంతో పారిశుధ్య కార్మికులకు నూతన వస్త్రాలు పంపిణి చేసారు.